Monthly Archives: July 2021

గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కొరెల్లి గంగమణి (35) జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న పత్తి రవికుమార్‌ ఏ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …

Read More »

పరీక్షలు వెంటనే రద్దు చేయాలి

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీటెక్‌, పాలిటెక్నిక్‌ డిప్లమోకి సంబంధించి విజయా రూరల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగే ప్రాక్టికల్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పరీక్షలు రద్దు చేయాలని కళాశాల ప్రిన్సిపల్‌ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం వేణు రాజ్‌ మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ …

Read More »

ఎవరికి ఇష్టమైన మొక్కలు వారికి ఇవ్వండి…

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి బాన్సువాడ మండలం …

Read More »

దళిత సాధికారత కృతజ్ఞత సభ

మోర్తాడ్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలో గురువారం దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సాధికారత కృతజ్ఞత సభ నిర్వహించారు. సభకు మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా అధ్యక్షత వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల అభ్యున్నతి కొరకై ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయడం పట్ల …

Read More »

పల్లె ప్రగతి కొరకు గ్రామ సభ

మోర్తాడ్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గురువారం గ్రామ సర్పంచ్‌ బోగ ధరణి ఆనందు అధ్యక్షతన పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో వచ్చే పది రోజులలో గ్రామంలో జరపాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలో అండర్‌ డ్రైనేజీ నూతన విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు చేయాలని …

Read More »

పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్‌ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనేదానిపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామంలో ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో …

Read More »

కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్స్‌ డే సందర్భంగా వేల్పూర్‌ మండలం పడగల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సిబ్బందిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రమేష్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాత్రి పగలు గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. గ్రామంలో వైద్య …

Read More »

పల్లెప్రగతిలో మంత్రి, కలెక్టర్‌…

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వేల్పూరు మండల కేంద్రంలో జంబి హనుమాన్‌ వద్ద బతుకమ్మ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వసతులు కల్పించడమే …

Read More »

7 నుంచి ప్రాక్టికల్స్‌

డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను ఈ నెల 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు మొదటి విడుత ఈ నెల …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచాము…

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని ముఖ్యంగా కోవిడ్‌ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకితభావంతో చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ అన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా హరిదా రచయితల సంఘం తమను గౌరవించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. రచయితలు అంటే ప్రజలలో ధైర్యాన్ని తమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »