కామారెడ్డి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు, హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలులో విఫలం అయిందని ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా రైతులకు అందించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతుల పట్ల టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీడిపల్లి రాధాకృష్ణన్ రెడ్డి, నర్సారెడ్డి, జిల్లాకు సంబంధించిన అన్ని మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.