డిచ్పల్లి, ఆగష్టు 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గల కెమిస్ట్రీ విభాగంలో మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపస్ సెలెక్షన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగాధిపతి డా. జి. బాలకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీ ‘‘కెమినో టెక్’’ లోని రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ విభాగంలో ఉద్యోగాల కొరకు ఈ డ్రైవ్ నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉద్యోగానికి అర్హులని తెలిపారు. ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగిన వారు తమ తమ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో క్యాంపస్ డ్రైవ్ కు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని కెమిస్ట్రీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కొరకు 9908833969 (డా. జి. బాలకిషన్) ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.