నిజామాబాద్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 4 వేల పాడి పశువులను మహిళా సంఘాల సభ్యులకు రుణాల ద్వారా అందించుటకు అవకాశం ఉన్నందున అర్హులైన సంఘాల సభ్యులు ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో మహిళలను కోరారు.
పాడి పశువుల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం ఉన్నందున మహిళా సంఘాల గ్రూపులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాడి పశువులను ఇతర రాష్ట్రాల నుండి స్వయంగా ఎంపిక చేసుకొని కొనుగోలు చేసుకోవడానికి డిఆర్డిఎ ద్వారా అవకాశం ఉన్నందున అంతేకాక ఒక్కో మేలు జాతి పాడి పశువులు కొనుగోలు చేసుకోవడానికి రూ. 93 వేల 270 రుణ సహాయం అందించడం ఉన్నందున ఈ దిశగా ఆసక్తిగల మహిళా సంఘాల సభ్యులు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
సంబంధిత మండల సమాఖ్యల ద్వారా వారి దరఖాస్తులను సమర్పించాలని ఇతర వివరాలను కూడా వారి ద్వారా తెలుసుకొని అన్ని వివరాలతో పక్కాగా ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ ప్రకటనలో మహిళలకు సూచించారు.