కామారెడ్డి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఎన్.సి.డి. (జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం) కార్యక్రమం క్రింద పాలియేటివ్ కేర్ కేంద్రంను కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, కామారెడ్డి మునిసిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియ ప్రారంభించారు.
ఇందులో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, ఎయిడ్స్ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు, పుండ్లు ఇతర తీవ్ర సమస్యలతో బాధ పడుతున్న వారికి సపర్యలు చేయడం, వారికి ఇంటి వాతావరణం కల్పించుట వంటి సౌకర్యాలు పాలియేటివ్ కేంద్రంలో ఏర్పాటు చేయబడతాయన్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మొత్తం 33 పాలియేటివ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నవని, ఇప్పటివరకు 15 జిల్లాలో ఈ కేంద్రాలు ఏర్పాటు కాగా కామారెడ్డి జిల్లాలో మంగళవారం పాలియేటివ్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా మన జిల్లా ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధుగ్రస్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం అధికారి జగన్నాథ్ రెడ్డి, జిల్లా ఎన్.సి.డి. ప్రోగ్రాం అధికారి డా.సుస్మితా రాయ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ. అధికారి డా.చంద్రశేఖర్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.అజయ్ కుమార్, వైద్యులు డా.మౌనిక ,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.