డిచ్‌పల్లి, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ఆచార్య నసీం వీసీ చాంబర్‌లో మంగళవారం ఉదయం డీన్స్ (పీఠాధిపతుల) సమావేశం నిర్వహించారు.
కొవిద్- 19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, కరోనా మహమ్మారి ఉదృతి నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ కోర్సులలో నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌లో ఉండే సెక్, జెనెట్రిక్ ఎలక్టీవ్ సబ్జెక్ట్ పేపర్స్‌కు చెందిన పరీక్షలకు పరీక్షా కేంద్రాలను వారి వారి మాతృ కళాశాలలోనే ఏర్పాటు చేస్తున్నట్లు నిర్ణయించామని రిజిస్ట్రార్ తెలిపారు.
ఇది వరకే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయం కూడా ఈ విధానాన్ని అవలంబించడానికి డీన్స్ మీటింగ్‌లో ప్రతిపాదన తీసుకున్నట్లు ఆమె తెలిపారు.