హెల్త్‌ వీక్‌ సర్వేకు అందరూ సహకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరు రకాల దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుండి హెల్త్‌ వీక్‌ సర్వే నిర్వహిస్తున్నందున ప్రజలు సహకరించాలని వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని తద్వారా వారికి అవసరమైన చికిత్స అందించడానికి వీలవుతుందని, అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం నుండి ఇంటింటికీ తిరిగి ఆరోగ్యశాఖ సిబ్బంది కుటుంబాలలోని ప్రజల ఆరోగ్య సమస్యలకు సంబంధించి వివరాలు సేకరించుటకు హెల్త్‌ వీక్‌ సర్వే చేస్తున్నారు. కావున ఇది చాలా సిస్టమెటిక్‌గా జరుగాలని, ప్రతి ఇంటిని టచ్‌ చెయ్యాలని, పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు.

అంతేకాక కరోనా మహమ్మారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడానికి తద్వారా వారికి భరోసా కల్పించినట్లు అవుతుందని అన్నారు. కోవిడ్‌-19 ఎవ్వరికి వచ్చినా వెంటనే కోవిడ్‌ కిట్‌ ఇవ్వాలి. వారికి కోవిడ్‌ తగ్గే వరకు మానిటర్‌ చెయ్యాలన్నారు. అదేవిధంగా మిగతా 6 రకాల జబ్బులు కలరా, టీబి, తలసేమియా, క్యాన్సర్‌ హెచ్‌ఐవి, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడే వారి పూర్తి వివరాలను సేకరించడంతో పాటు వాటిని కొత్తగా సిద్ధం చేసిన యాప్‌లో నమోదు చేయాలని తద్వారా ఆయా పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరిశీలించి తదుపరి చికిత్సలు అందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

హరితహారంలో ఇంకా లక్ష్యాలు పూర్తి కానందున దానిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా కృషి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. డిపిఓ, పిఆర్‌, డిఆర్‌డిఓ శాఖలు టార్గెట్‌ పూర్తి కావాలని, బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటాలని, ముందుగా ప్రతి బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో ఫిట్టింగ్‌ పూర్తి చేసి ఆగస్ట్‌ 15 వరకు మొక్కలు నాటడం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా శాఖల వారీగా సమర్పించిన వీడియో క్లిప్పింగులను ఆయన పరిశీలించారు. జిల్లా గ్రీనరీ శాతం పెరగాలంటే డిపిఓ, డిఆర్‌డిఓ శాఖలపై పెద్ద బాధ్యత ఉన్నదని, డిఆర్డిఓ నుండి ప్రతి రోజు జిపి వారిగా రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించారు. కావున ప్రతి రోజు మొక్కలు నాటితేనే లక్ష్యం పూర్తి అవుతుందని ఇందుకు ఉపాధి హామీ ద్వారా ప్రతి రోజు పనులు ఇవ్వాలని అధికాలను అదేశించారు.

కొన్ని శాఖల ప్రోగ్రెస్‌ చాలా పూర్‌ గా ఉన్నదని వారు వెంటనే మొక్కల లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. ఏలక్ట్రిసిటీలో చాలా లొకేషన్స్‌లో మొక్కలు పెట్టవచ్చు కావున వెంటనే ఫిట్టింగ్‌ మొదలు పెట్టి మొక్కలు నాటాలని, ఆగస్ట్‌ 15 వరకు పూర్తిచేయాలన్నారు. జిల్లా జైల్‌లో ఖాళీ స్థలంలో మొక్కలు పెట్టాలని, పిఆర్‌, రోడ్లు భవనాల శాఖల వారు ఏ ఒక్క రోడ్డు ఖాళీ స్థలం వదులవద్దని పెట్టిన మొక్కలు ఫోటోలు తీసి పంపాలని సంబంధిత అధికాలను ఆదేశించారు.

మొక్కలు చెడిపోయిన దగ్గర మరో మొక్క పెట్టాలి కానీ మొక్కలు లేకుండా ఎక్కడా ఇన్స్ట్యూషన్‌ ప్లాంటేషన్‌ ఉండకూడదన్నారు. అన్ని కూడా ఆగస్ట్‌ 13 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వెల్ఫేర్‌ హాస్టల్లో మొక్కలు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క మీటర్‌కు ఒక్క మొక్క ఉండాలని, అదేవిధంగా నేషనల్‌ హైవే 44, 63 పిఆర్‌, ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఒక్క మొక్క ఎండిపోకుండా వచన్‌ వార్డులను, వాటర్‌ ప్రతి రోజు చేసేవిధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, ఫారెస్ట్‌ అధికారి సునీల్‌, ట్రెయినీ ఐఏఎస్‌ మకరంద్‌, అరవింద్‌ డియస్‌పి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »