వేల్పూర్, ఆగష్టు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిడిఎస్‌యు, పివైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండి చేస్తూ, వేల్పుర్ మండల కేంద్రంలోని జిల్లా మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులను అక్రమంగా ఆరెస్టు చేసి వేల్పురు పోలిస్ స్టేషన్‌కు తరలించారని సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు ఖండిరచాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్, సత్యం, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్పన, గౌతం కూమార్ మాట్లాడుతూ, తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక పిట్టలుగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటు రాలిపోతుంటే ప్రభుత్వం చోద్యం చుస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఇంటికోక ఉద్యోగం అని రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలు దాటినా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబానికి, నిరుద్యోగుల ఉసురు తగులుతుందని అన్నారు.
నిరుద్యోగుల ఆత్మ హత్యలను రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వానికి తెలియకపోవడం, కేసిఆర్ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు 3 వేల 116 రూపాయల జీవనభృతి అమలు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు,
రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు పెండిరగ్‌లో ఉన్న 3.816 కోట్ల రుపాయల ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, జిల్లా కార్యదర్శి – పోశెట్టి, జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి, జిల్లా నాయకులు డి సాయిరెడ్డి, భాస్కర్, పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా నాయకులు ప్రశాంత్, అనిల్, ప్రణయ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.