డిచ్పల్లి, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కాగా డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్, పీజీ రెగ్యూలర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు.
ఉదయం 1012 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 461 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 407 మంది హాజరు, 54 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. అలాగే పీజీ నాల్గవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 34 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 34 మంది హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం 2
4 గంటల వరకు డిగ్రీ రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 118 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 103 మంది హాజరు, 15 మంది గైర్హాజరు అయినట్లు చెప్పారు.
పీజీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం ఒకరు విద్యార్థులు నమోదు చేసుకోగా ఒకరు హాజరయ్యారన్నారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.