నిజామాబాద్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోగల 250 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో కనీసం 25 వేల మొక్కలు నాటడానికి అవకాశం ఉన్నందున డిఆర్‌డిఎ, విద్యుత్ శాఖ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం విద్యుత్తు డిఆర్‌డిఎ శాఖలకు సంబంధించిన జిల్లాస్థాయి మండల స్థాయి అధికారుల హరితహారంపై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హరితహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి ఏడవ సంవత్సరంలో మొక్కలు నాటుతున్నప్పటికీ ఇంకా స్థలాలు ఖాళీగా ఉండటం ఎంతైనా శోచనీయం అన్నారు. జిల్లాలోని అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఈ గురువారం శుక్రవారం అందుబాటులో ఉన్న స్థలాలు అనుగుణంగా చేయించి సోమవారం నుండి ఆగస్టు 15వ తేదీలోగా పూర్తిస్థాయిలో మొక్కలను నాటించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్లను ఏపీవోలను ఆదేశించారు.
అవసరమైన మొక్కలకై మండల స్థాయి ఎంపీడీవోలను సంప్రదించాలని ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు లేకుండా పూర్తిస్థాయిలో మొక్కలు నాటాలని ఏ సబ్ స్టేషన్ పరిధిలోనైనా గ్యాప్ ఉంటే సంబంధిత ఈఈలను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాన్ఫరెన్సులో ఎస్‌ఇ సుదర్శన్, డిఆర్‌డిఓ చందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.