నందిపేట్, ఆగష్టు 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ నుండి చిన్న యానం వరకు గల 17 కిలోమీటర్ల రోడ్డును కేవలం 14 కిలోమీటర్ల మాత్రమే అనగా జిజినడ్కుడ వరకు చేసి మిగిలిన 3 కిలోమీటర్లు చిన్నాయనం రోడ్డును చేయక వదిలివేసిన రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదిక కింద మంజూరు చేసి రోడ్డు వేయించగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నుతుల శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, మండల అధ్యక్షులు ఎలిగేటి రాజు, మండల నాయకులు, మండల ఎంపిటిసిలు వివిధ మోర్చా నాయకులు, చిన్నయానం ప్రజలు పాల్గొన్నారు.