సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో టీయూ ఎంఓయూ

డిచ్‌పల్లి, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జాయింట్‌ సెక్రటరీ డా. మామిడాల ప్రవీణ్‌ వీసీ చాంబర్‌లో బుధవారం ఉదయం సంతకం చేసి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఈ సందర్బంగా ఉపకులపతి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు చెందిన, గ్రామీణ ప్రాంతాలలో అత్యంత పేదరికంలో పుట్టి పెరిగిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఎంతగానో సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. అచిరకాలంలోనే 268 గురుకుల విద్యాసంస్థలతో విస్తరించి విద్యా, సామాజిక, సాంస్కృతిక, క్రీడా రంగాలలో విజయపథంలో పయనిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి సైన్స్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌ మెంట్‌, కామర్స్‌ కోర్సులలో విద్యార్థులను ప్రావీణ్యులను చేసి, ఉద్యోగ భృతి కలిగించే విధంగా శిక్షణ ఇస్తున్నట్లుగా ఆయన వివరించారు. అటువంటి ఉత్తమ ప్రమాణాలు కలిగిన సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఒప్పందం ద్వారా సుదీర్ఘమైన అనుబంధం పెరిగి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులకు, విద్యార్థులకు పరిశోధనా పరమైన లాభం చేకూరుతుందని అన్నారు.

ఈ సందర్బంగా జాయింట్‌ సెక్రెటరీ డా. మామిడాల ప్రవీణ్‌ మాట్లాడుతూ సమ్మర్‌ అండర్‌ గ్రాడూయేట్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాం, సెంట్రల్‌ లైబ్రరీ, రీసెర్చ్‌ లాబొరేటరీస్‌లోకి ప్రవేశం వంటి విషయాలలో ఒప్పదం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిబంధనలు :
తెలంగాణ విశ్వవిద్యాలయం ఒప్పందం :
ఈ విధానంలో ప్రవేశాల కోసం సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌, ఆర్ట్స్‌, కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌, ఎడ్యుకేషన్స్‌, ఇంటర్‌ డిసిప్లినరి, అప్లైడ్‌ సైన్సెస్‌, మేనేజ్‌ మెంట్‌ స్టడీస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, పార్మాస్యూటికల్‌ సైంచెస్‌, లైఫ్‌ సైన్సెస్‌ మరియు సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌ లలో ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం.

సెంట్రల్‌ లైబ్రరీలలో ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ సర్వీసెస్‌ కోసం అభ్యర్థించడం, ఇంటర్న్‌ షిప్‌ కాలం పాటు విద్యార్థులకు వసతిని అభ్యర్థించడం, ఇంటర్న్‌ షిప్‌ కాలం పాటు సెంట్రల్‌ లైబ్రరీ వనరులను అభ్యర్థించడం.

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఒప్పందం :
ప్రతి విభాగం నుంచి ఎస్‌యుఆర్‌ఎఫ్‌ ఎంపిక ప్రక్రియను చేపట్టడం ఎస్‌యుఆర్‌ఎఫ్‌ ఇంటర్న్‌ షిప్‌ కోసం 5 వేల రూపాయలు విద్యార్థుల వసతి, ప్రయాణ భారం వహించడం.

ఎస్‌యుఆర్‌ఎఫ్‌ ఇంటర్న్‌ షిప్‌ కోసం డిసెంబర్‌ 2021 లో విభాగాల వారిగా ప్రణాళిక ప్రారంభమవుతుందని డా. మామిడాల ప్రవీణ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ 5 సంవత్సరాల వరకు కొనసాగుతుందని, అవకాశం ఉంటే ఇంకా 5 సంవత్సరాలు పొడిగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »