డిచ్పల్లి, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను గురువారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీసీ రవీందర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీసీ పరిశోధనా నేపథ్యం, ఉత్తమ అధ్యాపక తత్వాన్ని, మృదువైన మనస్తత్వాన్ని గూర్చి సూర్యాధనంజయ్ ప్రశంసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వీసీగా ఆచార్య డి. రవీందర్ నియమింపబడినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఆచార్య సూర్యాధనంజయ్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ కమిటీలలో సభ్యులుగా ఉండి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నారని వీసీ ఆచార్య రవీందర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ కమీషనర్ డా. ధనంజయ్, పరిశోధక విద్యార్థి రవి, పిఆర్ఓ డా.వి. త్రివేణి ఉన్నారు.