భీమ్‌గల్, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డకు జన్మనివ్వడానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి అని వారు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, అంగన్‌వాడి టీచర్లు, ఆశావర్కర్లు , పోషణ అభియాన్ కోఆర్డినేటర్లు, యూత్ అధ్యక్షులు రావుట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.