నిజామాబాద్, ఆగష్టు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సర్వేతో అభ్యున్నతికి, ఆర్ధిక వికాసానికి మహిళ సంఘాలు, సమాఖ్యలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళ సంఘాల బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తుందని ప్రతి మహిళ ఒక ఆదాయభివృద్ది కార్యక్రమం చేపట్టి తమ ఆదాయం పెంచుకోవాలని డిఆర్‌డివో చందర్ నాయక్ సూచించారు.

స్త్రీ నిధి బ్యాంకు ద్వారా జిల్లాలో 4 వేల పాడి గేదెలకు రుణాలు ఇస్తున్నామని ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ సంఘం, మండల సమాఖ్యలు తప్పనిసరిగా ఒక ఆదాయ అభివృద్ధి కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. తమ ప్రాంతంలో ఏ ఏ ఉత్పత్తులు లభిస్తాయో వాటి ఆధారంగా ప్రాసెస్సింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఆదాయం పొందాలని తెలిపారు.
నవీపేట్, బాల్కొండ, రెంజల్, సిరికొండ మండల సమాఖ్యల అధ్యర్యంలో వరికోత యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు తీసుకోవడానికి ముందుకు వచ్చారని వారిని అభినందించారు. ఇలాగే ప్రతి మండల సమాఖ్య ముందుకు రావాలని సూచించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఉషారాణి, ఆదనపు డిఆర్‌డివో మధుసూదన్, స్త్రీ నిధి జోనల్ మేనేజర్ అనంత కిషోర్, డిపిఎంలు రాచయ్య, సాయిలు, నీలిమ, సంధ్య రాణి, మారుతి, శ్రీనివాస్, 27 మండలాల ఏపిఎంలు, జిల్లా సమాఖ్య ఇసి సభ్యులు పాల్గొన్నారు.