ఫ్లెక్సీలు తొలగించవద్దు…

కామారెడ్డి, ఆగష్టు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాక్సినేషణ్‌ సెంటర్ల వద్ద, రేషన్‌ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించవవద్దు అని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏవో ద్వారా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ వేసినందుకు గాను వ్యాక్సినేషణ్‌ సెంటర్ల వద్ద, కరోనా కారణంగా పేద ప్రజలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతో గరీబ్‌ కళ్యాణ్‌ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు ఉచిత 10కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నందుకు కృతజ్ఞతగా రేషన్‌ షాపుల వద్ద ప్రధాని మోదీ చిత్ర పటంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిందని అన్నారు.

బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొన్ని మండలాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక తహిసీల్ధార్లు, ఇతర అధికారులు తొలగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఇకపై ఇలా జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా అధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకటం మానుకోవాలన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »