బోధన్, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 25,30 సంవత్సరాలుగా కష్ట పడి సాగు చేసుకుంటున్న పేదలను ప్రభుత్వ అదికారులు గెంటి వేయడం సరికాదని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్ మండి పడ్డారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఫారెస్ట్‌కు సమీపంలో గత 25,30 సంవత్సరాలు కష్టపడి సాగు చేసుకుంటున్న భూముల నుండి మండల వన కేంద్రం కోసమని గెంటి వేయడం అన్యాయమన్నారు.
సాగు చేసుకుంటున్న భూములకు పట్ట పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ‘‘రైతు బందు’’ పథకం ద్వార డబ్బులు కూడ వస్తున్నాయని, అట్టి భూముల నుండి పేద ప్రజలను బయటకు వెళ్లగొట్టడం సరికాదన్నారు. శుక్రవారం వారు సాగు చేసుకుంటున్న భూముల్లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పర్యటించారు. ప్రభుత్వం రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు.