డిచ్‌పల్లి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శుక్రవారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రిజిస్ట్రార్ ఆచార్య నసీం జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి, వందనం చేశారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలిపారు. తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అహర్నిశలు శ్రమించిబీ అనేక సామాజిక, సాంస్క ృతిక, భాషా పరమైన నివేదికలు రూపొందించి విష్లేషణ చేశారని పేర్కొన్నారు.
జయశంకర్ సార్ ప్రామాణిక విద్యా విలువల కోసం పరిశ్రమించారని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్‌గా విధులు నిర్వర్తించి భావి విద్యార్థులను, పరిశోధకులను తీర్చిదిద్దారని అన్నారు. జయశంకర్ సార్ వ్యక్తిత్త్వం, మనస్తత్వం, ఆశలు, ఆశయాలను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు పుణికి పుచ్చుకోవాలని తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో వారి స్పూర్తిని కొసాగించడానికి ప్రయత్నించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిఆర్‌ఓ డా. వి. త్రివేణి, ఎఇ వినోద్ కుమార్, సూపరింటెండెంట్ భాస్కర్, ఎస్టేట్ ఆఫీసర్స్ యాదగిరి, అశోక్ వర్ధన్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.