కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ స్థలాలు ఉంటే మండలానికి రెండు బృహత్ పల్లె ప్రక ృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ స్థలాలను తహసీల్దార్లు గుర్తించాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్ పెండిరగ్ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఏవో రవీందర్, ఆర్డివోలు శీను, రాజా గౌడ్ సూపరింటెండెంట్లు నారాయణ, రంజిత్ కుమార్, ఉమలత, సరళ, సప్న, సువర్ణ పాల్గొన్నారు.