మోర్తాడ్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గల్ఫ్ కార్మికుల రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాలకు చెందిన చాంద్ పాషాను నియమిస్తూ రాష్ట్ర సంఘం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విస్తరణకై దృష్టి సారించాలని ఉద్యమకారుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు నిరంతరకృషి చేయాలని రాష్ట్ర చైర్మన్ ఆదేశించారని చాంద్ పాషా తెలిపారు. తన నియమానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.