ఆర్మూర్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనిఆరం ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో జియో టవరు వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. సిపిఎం ఆర్మూర్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ రామ్ నగర్‌లో గల టవరు వేసే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. ఏఓకి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం వెళ్లి మున్సిపల్ కమిషనర్‌కి వినతి పత్రం ఇచ్చారు. జియో టవర్ ఆపేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించారు. వెంటనే ప్రభుత్వం మున్సిపల్ అధికారులు జియో టవర్ అనుమతి రద్దుచేయాలని అక్కడ ప్రజలకు నష్టం జరిగే జియో టవర్ నిలిపివేయాలని అన్నారు.
జియో టవర్‌ను నిర్మించి తీరుతామని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరు చస్తే నాకేంటి అని నాకు పైసలు ముఖ్యమని రియల్ ఎస్టేట్ వ్యాపారి యజమాని కాలనీవాసులను బెదిరించడం, కెనాల్ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్ చేసి ప్లాట్లు అమ్ముకోవడమే కాకుండా జియో టవర్ నిర్మించడం జరిగిందని కాలనీవాసులు వాపోయారు.