కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కోరారు. సదాశివనగర్ మండలం పద్మాజివాడి నుంచి భూంపల్లి వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో ఉన్న మొక్కలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.
భూంపల్లి గుట్టపై ఉన్న పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. సమీపంలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు సక్రమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు నాటనందున ఎండిపోవడంతో పంచాయతీ కార్యదర్శి రాజకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎంపీడీవో రాజీవీర్, ఎపీఓ శృతి, సర్పంచ్ లలిత, పంచాయతీ కార్యదర్శులు స్వాతి సూర్య శ్రీ, రాజకుమార్ పాల్గొన్నారు.