వేల్పూర్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో సి.ఈ నీటి సరఫరా ట్యాంకులను పరిశీలించి నీటి సరఫరా వివరాలను గ్రామ సర్పంచ్ తీగల రాధామోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా రోజుకు ఎన్ని సార్లు జరుగుతుందని, సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నీటి సరఫరా చేసే టాంక్‌లను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలన్నారు.
జనాభా ప్రాతిపదికన సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఏ ట్యాంకులకి ఎంత జనాభా కలిగివున్నారో వెంటనే లెక్కలు తీయాలని చెప్పారు. భగీరథ నీరు అన్నీ పరీక్షలు జరిగాకే నీటిని ప్రజలకి అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు నీటిని త్రాగవచ్చు అని తెలిపారు. గ్రామంలోని ప్రధాన నీటి టాంక్‌లని అన్నిటినీ పరిశీలించారు. ట్యాంకులకు ఏదైనా మర్మతులు ఉంటే వెంటేనే పూర్తి చేయాలని అన్నారు.
చీప్ ఇంజినీర్‌తో పాటు వేల్పూరు ఉప సర్పంచ్ పిట్ల సత్యం, గ్రామీణ త్రాగు నీటి సరఫరా అధికారులు యస్.ఈ రాజేంద్ర కుమార్, ఈఈలు రాకేష్, నరేష్, డి .ఈ అనిల్, ఏఈ అమీర్ ఖాన్, గ్రామ పంచాయితీ సెక్రటరీ వినోద్ కుమార్ పాల్గొన్నారు.