ఆర్మూర్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘‘కిసాన్ సమ్మాన్ నిధి’’ స్కీం క్రింద రైతులకు ప్రతీ సంవత్సరం మూడు విడతలుగా విడుతకు రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తూ, ఆ కార్యక్రమం నేటి నుండి ప్రతి రైతుకు లబ్ధి చేకూరడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసినట్టు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండల శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి లక్కారం సాగర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పసుపుల సాయికుమార్, ఉపాధ్యక్షులు పెరంబదూర్ వాసు, భూపిందర్, ప్రసాద్, శ్యామ్, సైవే రాజు తదితరులు పాల్గొన్నారు.