నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సి కవిత నిజామాబాద్ రూరల్ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పలు అభివృద్దికార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మొదట కాలూరు గ్రామశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ ప్రాంగణంలో మొక్క నాటి నీరుపోశారు. అనంతరం అక్కడే కాలురు చెరువు మిని ట్యాంక్ బండ్ నిర్మాణపనులకు శంకు స్థాపన చేశారు. గూపన్ పల్లి ఫరిదిలో గల గంగస్థాన్ ఫెస్ టు లో పట్టణ ప్రకృతివనానికి భూమిపూజ చేసారు. అనంతరం బొర్గం ఫరిదిలో నూతనంగా నిర్మిచిన రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సి వీజీ గౌడ్, మాజి ఎమ్మెల్సీ అరికెల నర్సరెడ్డి, మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.