నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ బస్టాండ్ దగ్గర వ్యవసాయ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రైతు వ్యవసాయ చట్టాలను ఆమోదించడం సిగ్గుచేటని వారన్నారు.
అదేవిధంగా దేశ సంపదను మొత్తం పెట్టుబడిదారీ వర్గానికి అంబానీ, ఆదానిలకు దారాదత్తం చేయడం సిగ్గుచేటని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢల్లీి నడిరోడ్డు పైన దాదాపు ఏడు నెలలు నుండి పోరాటం చేస్తున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఉందని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటన్నారు.
కాబట్టి తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక చట్టాలను ప్రభుత్వం రంగాలను ప్రయివేట్ పరం చేయడం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని దేశ ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాజన్న, నాయకులు రంజిత్, రఘురాం తదితరులు పాల్గొన్నారు.