కేంద్రమంత్రిని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కిషన్‌ రెడ్డిని ఢల్లీిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.

క్యాబినెట్‌ మంత్రిగా మన తెలంగాణకు చెందిన వారు నియమితులు కావడం చాల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం డ్యామ్‌, పరిసర అటవీ ప్రాంతాన్ని నూతన టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి దేశంలో గల మానవ నిర్మిత పురాతన జలాశయ కట్టడాలలో ఒకటైన పోచారం ప్రాజెక్ట్‌ని మంచి టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి పోచారం ప్రాజెక్ట్‌ను పర్యాటక సర్క్యూట్‌గా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జహీరాబాద్‌ ఎం.పీ బి.బి పాటిల్‌, ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »