నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈసారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆగస్ట్ 15న స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రతి కార్యాలయంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు పరేడ్ గ్రౌండ్‌కు రావాలని, ప్రతిదీ కలర్ ఫుల్‌గా ఉండాలని ఆదేశించారు.
అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆగస్టు 15 చాలా గ్రాండ్‌గా జరగాలని, ప్రతిదీ పద్దతి ప్రకారంగా జరిగేలా చూసుకోవాలని, కల్చరల్ ప్రోగ్రామ్స్‌కు వ్యాక్సిన్ వేసుకున్న పెద్ద వారితో ఏర్పాటు చెయ్యాలని, ఫోటో స్టాల్స్, ఎగ్జిబిషన్ గతంలో చేసిన విధంగా ప్రతి అధికారి చెయ్యాలని ఆదేశించారు. అదేవిధంగా మంగళవారం బాల అదాలత్ ప్రోగ్రామ్ ఉన్నది కావున ప్రతి ఒక్క అధికారి హాజరు కావాలని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, రెవెన్యూ శాఖ వారు ప్రోటోకాల్ చూసుకోవడానికి ఒక ఎంఆర్‌ఓ ను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెల్త్ శాఖ వారిచే ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని, డీఈఓ స్టాల్ పెట్టాలని, డిపిఓ, డిసియల్, వెల్ఫేర్ శాఖ, సీఈఓ వారు తప్పక హాజరు కావాలని ఆదేశించారు.
హరితహారంలో ఇంకా లక్ష్యాలు పూర్తి కానందున దానిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా కృషి చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. డిపిఓ, పిఆర్, డిఆర్‌డిఓ శాఖలు లక్ష్యాలను ఆగస్టు 15 వరకు పూర్తి కావాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటాలని, ఈ సందర్భంగా శాఖల వారీగా సమర్పించిన వీడియో క్లిప్పింగులను ఆయన పరిశీలించారు.
జిల్లా గ్రీనరీ శాతం పెరగాలంటే డిపిఓ, డిఆర్‌డిఓ శాఖలపై పెద్ద బాధ్యత ఉన్నదని, పి ఆర్, రోడ్లు భవనాల శాఖల వారు ఏ ఒక్క రోడ్డు ఖాళీ స్థలం వదులవద్దని పెట్టిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని సంబంధిత అధికాలను ఆదేశించారు. మొక్కలు చెడిపోయిన దగ్గర మరో మొక్కను పెట్టాలి కానీ మొక్కలు లేకుండా ఎక్కడా ఎవెన్యూ, ఇన్స్ట్యూషన్ ప్లాంటేషన్ ఉండకూడదన్నారు. అన్ని కూడా ఆగస్ట్ 15 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నేషనల్ హైవే 44, 63 పిఆర్, ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఒక మొక్క ఎండిపోకుండా వచన్ వార్డులను, వాటర్ ప్రతి రోజు చేసేవిధంగా చూడాలని, గత 15 రోజుల నుండి వర్షాలు పడటం లేదు కావున వాటర్‌పై ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. హెల్త్ వీక్ సర్వే పూర్తి అయినది కానీ రిపోర్ట్స్ సరిగా లేనందున మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ సర్వే చేయిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఫారెస్ట్ అధికారి సునీల్, మున్సిపల్ కమీషనర్ జితేష్, ఉషా విశ్వనాథ్ డియస్‌పి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.