డిచ్పల్లి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 6 వేల 282 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5 వేల 962 మంది హాజరు, 320 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
మధ్యాహ్నం 2 – 4 గంటల వరకు డిగ్రీ నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 9 వేల 634 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 8 వేల 951 మంది హాజరు, 683 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.