వేల్పూర్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామ కార్యదర్శి బోజేంధర్ సోమవారం ఇటీవల మొక్కలను, డంపింగ్ యార్డును, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్ యార్డులను స్మశానవాటికలో నాటిన మొక్కలను పరిశీలించినట్టు తెలిపారు. అమీనాపూర్ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పాలకవర్గ సభ్యుల సహకారంతో గ్రామంలో వాడ వాడలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.