నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికైన ఇద్దరు నిజామాబాద్ బాలికలకు అర్థిక సాయం అందించారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సింగరావు యొక్క ఇద్దరు కుమార్తెలు హర్షిత, రిషితలు చెస్ క్రీడాకారిణిలు. నిజామాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ అనేక చెస్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. త్వరలో నేపాల్లో జరిగే ఇండో- నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు రిషిత, హర్షిత ఎంపికయ్యారు. ఖాట్మాండ్లో ఈ నెల 14,15 న చెస్ పోటీలు జరగనున్నాయి. అయితే నర్సింగరావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పలువురు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం నిజామాబాద్లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత హర్షిత, రిషితలను అభినందించారు.
అంతేకాదు టోర్నమెంట్లో పాల్గొనేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాలికలు హర్షిత, రిషితలకు అన్ని రకాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీకి నర్సింగరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.