నిజామాబాద్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ఆపైన విద్యార్థులకు సంబంధించి 2017 18 నుండి 2020
21 వరకు పెండిరగ్ ఉపకార వేతనాలకు సంబంధించి సంబంధిత కళాశాలలో ఈ నెల 18 లోగా సంబంధిత శాఖలకు అన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
కలెక్టరేట్ నుండి సెల్ కాన్ఫరెన్సు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిజేబుల్డ్ జిల్లా అధికారులతో కళాశాలల విద్యార్థుల ఉపకారవేతనాల పెండిరగ్‌కు సంబంధించి వివరాలు సమర్పించ వలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సంవత్సరాలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఆపైన చదువుతున్న, చదివిన విద్యార్థులు ఈ పాస్ వెబ్‌సైట్‌లో వారి ఆధార్, బ్యాంకు, కోర్స్ తదితర అన్ని వివరాలను నమోదు చేసినందున సంబంధిత కళాశాలల లాగిన్‌లలో నమోదు చేసుకున్నారని, కళాశాల వారిగా విద్యార్థుల వారిగా సంబంధిత సంక్షేమ శాఖలకు ఆ వివరాలను పూర్తిస్థాయిలో కళాశాలల ప్రిన్సిపాల్స్ అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి అర్హులైన విద్యార్థుల వివరాలను జిల్లా అధికారులకు ఈనెల 16 నుండి ప్రారంభించి 18 లోగా విద్యార్థుల వారీగా ఇయర్- వైజ్ అన్ని వివరాలు పూర్తిచేసి పంపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 30 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాగిన్ క్లోజ్ కానున్నందున ఎంత మాత్రము విద్యార్థుల వివరాలు ప్రభుత్వానికి పంపించడానికి వీలుపడదని స్పష్టం చేశారు. కావున ఆ తర్వాత ఎవరైనా విద్యార్థులు తమకు ఉపకార వేతనాలు అందలేదని వస్తే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ బాధ్యత వహించవలసి ఉంటుందని వారు నేరుగా రాష్ట్రస్థాయి ప్రిన్సిపల్ కార్యదర్శి కలవవలసి ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు వివరాలను పరిశీలించి తుది జాబితా సమర్పించాలని ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్సులో జిల్లా ఎస్‌టి, ఎస్సీ, బిసి, మైనార్టీ, డిజేబుల్ శాఖల అధికారులు నాగా రావు, శశికళ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.