మోర్తాడ్, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల నూతన జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులుగా కె సురేష్ గౌడ్, ఎండి సాదిక్ ఆధ్వర్యంలో అందరి అభిప్రాయం మేరకు ఏర్పాటు చేశారు.
మోర్తాడ్ మండల జర్నలిస్టుల సంఘం నూతన అధ్యక్షులుగా బండి నారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ హుస్సేన్, ఉప కార్యదర్శి గట్టు భరత్, సహాయ కార్యదర్శిగా సామ్రాట్ అశోక్, సెక్రెటరీ ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా చక్రధర్ గౌడ్, ఫోల్కార్ కిషోర్, కార్యవర్గ సభ్యులుగా కొలిపాక మధుకర్ మామిడి రాజు, కొలిపాక నరేందర్ గౌడ్ లతోపాటు మోర్తాడ్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ చిన్న పెద్ద అనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అనే తేడా లేకుండా అన్ని శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరించాలని నూతన కార్యవర్గ సభ్యులు కోరారు. జిల్లా, డివిజన్ల, మండలాల, అన్ని జర్నలిస్టుల సంఘాలకు తాము అన్ని విధాలుగా యూనియన్లకు అతీతంగా సహకరిస్తామని, తమ మోర్తాడ్ మండల జర్నలిస్టు సంఘానికి అన్ని జర్నలిస్టు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు.