కామారెడ్డి, ఆగష్టు 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటని కామారెడ్డి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో జస్టిస్ కేశవరావు సంతాప సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్ కేశవరావు అంచలంచలుగా ఎదిగి హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నో సంచలన తీర్పులు వెలువరించాలని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదిగా, పలు కంపెనీలకు స్టాండిరగ్ కౌన్సిల్‌గా పనిచేసి ప్రసిద్ధి గాంచారనీ వారన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ కేశవరావు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రాజకుమార్, మొబైల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేష్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు జుడిషియల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.