నిజామాబాద్, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ పరీక్షలు రేపటి నుండి 3 వేలు తగ్గకూడదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి హెల్త్ వీక్, దళితవాడ, బృహత్ పల్లె ప్రక ృతి వనం, ఫారెస్ట్ పునరుద్ధరణపై మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ పరీక్షలు తగ్గుతుందని రోజు మూడు వేలకు తగ్గకుండా పరీక్షలు చేయాలని అన్నారు. సర్వేలో తేలిన సస్పెన్స్ కేసులు కానీ కేసుల వారీగా మెడికల్ ఆఫీసర్ పరిశీలన చేయాలని ప్రతి సస్పెక్కెడ్ కేసులకు పరీక్షలు శనివారం వరకు నిర్వహించి రిపోర్ట్స్ రావాలని అన్నారు. కోవిడ్ కన్ఫామ్ కేసులకు మెడికల్ కిట్స్ ఇవ్వాలని మందులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలని, రోజు ఆశ వర్కర్ వారి ఇంటిని సందర్శించాలని అన్నారు.
సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యాప్తంగా క్యాంపులు టేక్ అప్ చేసి మేమున్నాం అని ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ పని చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. 6 వ్యాధులకు సంబంధించి డాటా క్లారిటీ రావాలన్నారు. దళితవాడ సర్వే పనులు ఎస్టిమేట్స్ పంపాలని స్ట్రీట్ లైట్ పోల్స్ న్యూ పోల్స్‌కు సంబంధించి కావలసిన మెటీరియల్ కాస్ట్ వేయాలని ఈరోజు తక్కువ టైంలో పూర్తి చేయడం జరిగిందని అధికారులను అభినందించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం వెంటనే ఫిట్టింగ్ పూర్తి చేసి వెళ్లాలని ఫాస్ట్‌గా పూర్తి చేయాలన్నారు ఎంపీడీవో ఫోకస్ చేయాలన్నారు. తాహసిల్దార్‌లు బృహత్ పల్లె ప్రక ృతి వనానికి ఇంకా నాలుగు సైట్స్ ఐడెంటిఫై చేయాలని రేపు సాయంత్రం వరకు గుర్తించి ప్రపోజల్స్ డిపిఓకు పంపాలన్నారు. ఎంపీడీవో ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. హరితహారం కొన్ని మండలాలు ఇంకా పెండిరగ్ ఉన్నాయని ఆగస్టు వరకు పూర్తి చేయాలని, వారంలో ప్లాంటేషన్ పెరగాలని, అనుకున్నది కావాలని అన్నారు.
జిల్లాలో ఉన్న సబ్ స్టేషన్లు, రైతు వేదికలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్‌లలో జిపి పరిధిలో ఉన్న పీహెచ్‌సిలలో వచ్చే సోమవారం వరకు మాడిఫై ఫొటోస్ రావాలని తెలిపారు. ఏవెన్యూ ప్లాంటేషన్ ఆగస్టు 13 వరకు పూర్తి కావాలని, ఏఈ. పిఆర్, ఆర్‌అండ్‌బి వారు మూడు మీటర్ల గ్యాప్ ఉండే విధంగా మొక్కలు మెయింటెనెన్స్, వాటరింగ్ సిస్టమేటిక్‌గా ఉండాలని వన సేవకులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సునీల్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ట్రైని కలెక్టర్ మకరంద్, డిఆర్‌డిఓ చంద్ర నాయక్, జడ్పీ సీఈఓ గోవింద్, డిపిఓ జయసుధ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.