ఆర్మూర్, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఇటీవల వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి సమక్షంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్ చేతులమీదుగా అందజేశారు.
ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంగీత ఖాందేష్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు నడుస్తున్నందున విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠ్య పుస్తకాలు అందచేశామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, పాఠశాల ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సునీత, సంధ్య, అనిత, రాజేంద్ర ప్రసాద్, విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.