పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలి

నిజామాబాద్‌, ఆగష్టు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి మహిళ సంఘాలకు మేలైన పాడి పశువులు అందించడానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో స్త్రీ నిధి మహిళ సంఘాలకు పాడి పశువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని అధికారులతో సమీక్ష ద్వారా ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేలు రకమైన పాడి పశువులను స్త్రీ నిధి మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వాలని జిల్లాలో మొత్తం 4 వేల వరకు లక్ష్యం ఉండగా 13 వందల మందిని గుర్తించడం జరిగిందని తక్కువ శాతం వడ్డీతో ఇవ్వనున్నట్లు తెలిపారు. పాల మార్కెటింగ్‌ విజయ డైరీ, ఇన్సూరెన్స్‌ పశుసంవర్ధక శాఖ ద్వారా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, జె.డి పశుసంవర్ధక శాఖ భరత్‌, స్త్రీ నిధి జోనల్‌ మేనేజర్‌ అనంత కిషోర్‌ ఐకేపీ ఏపీడీ మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »