ఆర్మూర్, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జెండా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు మహేష్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్మూర్ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద జెండా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని జెండా పండుగ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోణ వైరస్ దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కిషన్, సభ్యులు విజయ్, ప్రతాప్, పోహార్ శైలేష్, ఎస్ ఎస్ కె యువజన సమాజ్ అధ్యక్షులు ప్రశాంత్, సర్వ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.