డిగ్రీ, పీ.జీ ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, ఆగష్టు 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌. ఒక ప్రకటనలో తెలిపారు.

చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన అన్ని వయసుల అభ్యర్థులకు ఇదొక సదవకాశమని తెలిపారు. సంపాదిస్తూ చదువుకునే ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తూ ఉన్నత విద్య చదువుకునే అవకాశం ఉందన్నారు. ఇంటర్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐ.టీ.ఐ. పాసైనవారు డిగ్రీ అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. ఇంటర్‌ లో యం.పి.సి చదివిన వారు ఓపెన్‌ డిగ్రీలో మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, అర్థశాస్త్రం, బి.పి.సి లో చదివినవారు డిగ్రీ బోటనీ, జూలజీ, జియాలజి లాంటి కోర్స్‌లు చదివితే ప్రభుత్వ శాఖలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఓపెన్‌ వర్సిటీలో సైన్స్‌, ఆర్ట్స్‌ కోర్స్‌కు కలిపి చదువుకోవచ్చన్నారు.

డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీ.జీ పాసైన వారు కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా ఉద్యోగ అవకాశాలకు అర్హులన్నారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి ఇంటర్మీడియేట్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ (డిప్లమా), రెండు సంవత్సరాల ఐటిఐ, టెన్‌ ప్లస్‌ టు తత్సమాన అర్హతలు కలిగి ఉండాలన్నారు.

పీజీ ప్రవేశానికి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలని, అడ్మీషన్‌ పొందాలనుకునే వారు 27ఆగస్టు 2021 లోపు మీ దగ్గరలో ఉన్న మీ- సేవా కేంద్రం లేదా టి.ఎస్‌.ఆన్‌ లైన్‌ లలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకొని తగిన రుసుము చెల్లించిన తరువాత అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌లను రీజినల్‌ కార్యాలయం గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్‌లో అందజేయాలన్నారు.

మరిన్ని పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో లేదా గిరిరాజ్‌ కళాశాలలో సంప్రదించాలన్నారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »