డిచ్‌పల్లి, ఆగష్టు 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు.
ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 7 వేల 292 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 6 వేల 899 మంది హాజరు, 393 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం 2:00-4:00 గంటల వరకు డిగ్రీ నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 10 వేల 279 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 9 వేల 462 మంది హాజరు, 817 మంది గైర్హాజరు అయినట్లు ఆయన తెలిపారు.
ఉదయం జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ పరీక్షల్లో కామారెడ్డిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో ఒకరు, కామారెడ్డిలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో ఫిజిక్స్, జావా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్‌ల్లో ఇద్దరు, మధ్యాహ్నం జరిగిన నాల్గవ సెమిస్టర్ పరీక్షల్లో మోర్తాడ్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గల పరీక్షా కేంద్రంలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో ఒకరు, కామారెడ్డిలోని ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రంలో బిజినెస్ స్టాటిస్టిక్స్, సెల్ బయోలజీ, ఇండియన్ ఎకానమి, బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌ల్లో నలుగురు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ డిబార్ అయినట్లు ఆయన తెలిపారు.