వేల్పూర్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోణ మొదటి డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని డాక్టర్ అశోక్ అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, చికెన్ గున్యా మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముంది కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
అత్యవసరమైతే బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, చేతులను తరచూ సానిటీజర్‌తో శుభ్రం చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు నాగమణి, వనమాల, ఫార్మసిస్ట్ ధర్మపురి, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.