మోర్తాడ్, ఆగష్టు 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో గల డ్వాక్రా మహిళా గ్రూపుల సభ్యులు ఆయా బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో సక్రమంగా కట్టాలని ఐకెపి సిసి శ్రీనివాస్ కోరారు. శుక్రవారం మోర్తాడ్ మండలం శెట్పల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.
మహిళా గ్రూప్ సభ్యులు తీసుకున్న వివిధ రకాల రుణాలను బ్యాంకులు ఇచ్చిన సమయంలో తీర్చి వేయాలని సూచించారు. అలాగే నాబార్డు కోఆర్డినేటర్ మురళీమోహన్ మాట్లాడుతూ మహిళలు, రైతులు మహిళా సంఘాలు పిఏం ఇన్సూరెన్సు 342/0 రూపాయలను కట్టుకోవాలని తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారికి నాలుగు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. టిజిబి బ్యాంక్ మేనేజర్ హనుమాండ్లు మాట్లాడుతూ బ్యాంకులో లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్, శెట్పల్లి గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.