మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…

ఆర్మూర్‌, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారధి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. శుక్రవారం ఆర్మూర్‌లో చిట్ల ప్రమీల జీవన్‌రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా స్ఫూర్తి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

2008లో రిటైర్‌ అయిన ఎంఈఓ తమ బావగారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సమాజంలో చదువు యొక్క ప్రాధాన్యత పెరిగిందని చదువుకుంటేనే జీవితం, చదువు లేకుంటే మనిషి కాదు అన్న ఒక సత్యాన్ని అందరూ తెలుసుకున్నారని తెలిపారు. కూలి నాలి చేసుకునే వ్యక్తి కూడా ఈ రోజు తమ పిల్లలను అప్పులు చేసి వారిని మంచి పాఠశాలలో చదివించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

పిల్లలు చదువుకుని స్వతహాగా తమ కాళ్ళమీద తాము నిలబడాలని వారి కోరిక 10/10 వచ్చిన వారు ఏదో సాధిస్తారని తక్కువ మార్కులు వచ్చిన వారు ఏమి పనికిరాని వారని భావించనవసరం లేదన్నారు. మనం ఎప్పుడు కసి వస్తుందో అప్పుడే మూమెంట్‌ అవుతారు అది ఏ స్థాయిలో వస్తుందో మీ ఆలోచనలను బట్టి ఆధార పడుతుందని, స్నేహితులను తల్లిదండ్రులను మీకు చదువు చెప్పిన టీచర్లను బట్టి ఆధారపడుతుందన్నారు.

ప్రభుత్వం కూడా మొదటి నుండి ఉన్నత విద్య వరకు కావలసిన రకరకాల సపోర్టు అందిస్తుందని, కార్యక్రమాన్ని చేస్తున్న ఉద్దేశం విద్యార్థులకు ఏదో ఒక రూపాన సహాయ పడాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో పవిత్రమైన ఆలోచనలతో కొంతమంది కొంత కాలంలో సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివేవారు మీరు మంచి స్నేహితులను ఎంచుకోవాలి అన్నారు.

స్నేహితులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారన్నారు. మొబైల్‌ ఫోను వచ్చింది ఇది ఒక వరం ఇది మన జీవితానికి అదే సాక్షి కూడా ఇందులో ప్రపంచంలో ఉన్న మంచి చెడు ఉంటుందని, పిల్లలు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా తల్లిదండ్రులకు టీచర్లకు తెలియదు వారి స్నేహితులకు మాత్రమే తెలుస్తుందని, మంచి స్నేహితుల వలన మంచి అలవాట్లు వస్తాయని, విద్యార్థులు బద్ధకం అధిక నిద్ర మొహమాటం వీడితే గాని భవిష్యత్తు ఉండదన్నారు.

ప్రతిదీ వాయిదా చేయడం మంచిది కాదన్నారు. 17 సంవత్సరాలు కష్టపడితే మీ జీవిత లక్ష్యం చేరుకుంటారని, లక్ష్యం కోసం పనిచేయాలని, లక్ష్యం లేని వారు లేబర్‌ అవుతారని, మీరు లేబర్‌ అవుతారా లీడర్‌ అవుతారా మీరే నిర్ణయించుకోవాలన్నారు. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైతే మంచి స్నేహితులను ఎంచుకుంటారో వారి భవిష్యత్తు మొదటి మెట్టు ఎక్కినట్లే అన్నారన్నారు.

సిపి కార్తికేయ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఉండి ట్రస్టు ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని, ఇది వారి అదృష్టం అన్నారు. కరోనా కాలంలో విద్యార్థులు మంచిగా చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్ర మిశ్రా, చంద్రశేఖర్‌, డిఈఓ దుర్గాప్రసాద్‌, ఆర్‌డివో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »