వేల్పూర్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బంధు పథకంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్ హాజరై మాట్లాడారు.
దళిత బంధు పథకము ఒక హుజరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత, దళిత ఉపకులాల వారందరికీ అమలు చేయాలని, హైదరాబాదులో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, హుజురాబాద్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి జీవోలు తీసుకువచ్చి దళితుల అందరినీ దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్యుల నియోజకవర్గంలో దళిత కుటుంబాలు 35 వేలకు పైగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలందరికీ 10 లక్షల రూపాయలు అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బాలు, మాల మహానాడు అధ్యక్షుడు గోలి శ్రీనివాస్, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రభాకర్, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.