కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 28 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 893 మందికి 5 కోట్ల 48 లక్షల 67 వేల 400 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రాలను తమ కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.