కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు.
ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, ఉదయం 10.40 గంటలకు జిల్లా పురోగతిపై ప్రసంగిస్తారని, ఉదయం 11 గంటలకు అధికార, అనధికారులతో పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 11.10 గంటల నుండి సాంస్క ృతిక కార్యక్రమాలు, 11.40 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం, 12.10 గంటలకు స్టాల్స్ సందర్శన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.