కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ఎ.శరత్ పరిశీలించారు.
పరేడ్ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డిఓ శ్రీను, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు ఉన్నారు.