వేల్పూర్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం లోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఏఎస్ఐ జోహాన వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు తప్పకుండా మాస్కులు, హెల్మెట్ ధరించాలని అలాగే వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఆటోలలో ప్రయాణం చేసే వారు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు వేగంగా నడపవద్దని పేర్కొన్నారు. వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. తనిఖీల్లో స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.