నిజామాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణ మాసం సందర్భంగా నగరంలోని న్యాయవాదులు మొదటి శ్రావణ శనివారం నగరంలోని నీలకంఠేశ్వర్ దేవాలయం నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభించిన జై హనుమాన్ పాదయాత్ర రైల్వే శక్తి హనుమాన్ దేవాలయం నుండి సార్వజనీక గణేష్ మందిర్, శ్రద్ధానంద్ గంజ్, అర్సాపల్లి మీదుగా సారంగాపూర్ హనుమాన్ మందిరం చేరుకొని ప్రత్యేక పూజ హారతి నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదర్ మాట్లాడుతూ ప్రాచీన చరిత్రగల విశిష్ట మందిరం హనుమాన్ దేవాలయం ఇక్కడ భక్తుల కోరికలను భగవంతుడు నెరవేరుస్తారని ఇందూరు నగర ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ముఖ్యంగా గత సంవత్సరం నుండి ప్రజలను పట్టి పీడిస్తున్న కరోన మహమ్మారి నుండి ఇందూర్ నగర ప్రజలు కాపాడాలని మొక్కుకున్నట్టు పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు యం రాజేందర్ రెడ్డి, న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, న్యాయవాదులు ఉదయ్, అమరేందర్ రావు, వినయ్ కుమార్, ఏర్గట్ల గణేష్, పురుషోత్తం గౌడ్, తదితరులు యువకులు పాల్గొన్నారు.