నువ్వు లేని గుండె గాయాల దిబ్బగా మారింది
నువ్వు లేని మనసు పీడకలల ఆచూకీ గా మారింది
నా మేధస్సును నీ ఆలోచనలు చుట్టుముట్టాయి
ఏ క్షణం నువ్వు నా కంట చూసావో
ఆ క్షణమే నీకు నా మనసు రాసి ఇవ్వబడిరది
దుఃఖాల సాగరాలతో మోసపూరిత మాటలతో
నా మనసు కాగితాన్ని తడిపేసి పోయావు
పెదాలపై నీ పేరు చిరు సంతకంగా మారే లోపే
పదునైన మాటలతో పెదాల తీరాన్ని చిత్తడి చేసి వెళ్లావు
నా జీవితాన్ని నీకు తెల్లని కాగితంగా అప్పజెప్పాను
పిచ్చి రాతలతో నా తనువు తలక్రిందులుగా చేశావు
కాలాన్ని నీకు తాకట్టు పెట్టాను కన్నీళ్లు నాకు కానుకగా ఇచ్చావు
ఒట్టేసి చెబుతున్నా
నా సర్వస్వం నీకు అప్పజెప్పాను
ఒంటరి చీకటి గదులను నాకు కానుకగా ఇచ్చావు
రచయిత : రాధా పుత్ర
91333 38608